ఇదో వెరైటీ ఆధార్.. ఒక్కరోజే చెల్లుబాటు..!

ఇదో వెరైటీ ఆధార్.. ఒక్కరోజే చెల్లుబాటు..!

'పుర్రెకో బుద్ధి, జిహ్వ‌కో రుచి' అని ఊరికే అన్నారా... ఎవరి టెస్ట్ వాళ్లది మరి.. ఎవ్వరి ఐడియాలు వాళ్లవి.. పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ బెంగాలీ జంటకు ఓ కొత్త ఆలోచన వచ్చింది... వివాహానికి హాజరయ్యే అతిథులకు వడ్డించే ఆహార పదార్థాల జాబితా (మెను)ను ఆధార్ కార్డ్ నమూనాలో ముద్రించారు.. ఆ పెళ్లిలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో.. అది కాస్త సోషల్ మీడియాకు ఎక్కింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలోని రాజర్హాట్‌లో గొగోల్ సాహా, సుబర్న దాస్ వివాహం ఈ నెల 1వ తేదీన జరిగింది.. తమ ప్రత్యేకతను చాటుకోవాలని భావించిన ఆ జంట.. వెడ్డింగ్ ఫుడ్ మెనూ కార్డ్‌ను ఆధార్‌ కార్డు నమూనాలో తయారు చేశారు. అసలే అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్.. ఆ ఫోన్‌లో వీలైనన్ని సోషల్ మీడియా యాప్‌లు ఇంకేముంది.. ఓ అతిథికి ఆ మెనూ కార్డు ఎంతగానో నచ్చింది.. వెంటనే ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. దీంతో.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. 

ఇక, దీనిపై ఆనందం వ్యక్తం చేస్తోంది ఆ జంట.. పెళ్లి కొడుకు మాట్లాడుతూసాహా మాట్లాడుతూ, తామిద్దరం డిజిటల్ ఇండియాను సమర్థిస్తామని చెప్పారు. తన భార్య సుబర్నకు వచ్చిన ఆలోచన మేరకు తమ వెడ్డింగ్ ఫుడ్ మెనూ కార్డ్‌ను ఆధార్ కార్డు నమూనాలో ప్రింట్ చేయించామని తెలిపారు.. అసలే అన్నింటికీ ఆధార్ కార్డు అవసరం.. ఏ పనికావాలన్నా ఆధార్ కావాల్సిందే కదా..! దీంతో ఈ మెనూ కార్డుపై జోకులే పేలుతున్నాయి.. ఓ వైపు వడ్డించే వంటకాల వివరాలతో పాటు.. మరోవైపు.. ఈ ఒక్క రోజు మాత్రమే చెల్లుబాటు అవుతుందంటూ ముద్రించారు.. మొత్తానికి ఒక్కరోజు మాత్రమే చెల్లుబాటు అయిన ఈ వెడ్డింగ్ మెనూ కార్డు నెట్టింట్లో వైరల్ అయిపోయింది.