ఎన్నికల ఫలితాలపై డేటా లీక్‌ ఎఫెక్ట్‌

ఎన్నికల ఫలితాలపై డేటా లీక్‌ ఎఫెక్ట్‌
ఎన్నికల ఫలితాలపై ఆధార్‌ డేటా లీకేజీ ప్రభావం చూపిస్తుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. బ్రిటీష్‌ సంస్థ కేంబ్రిడ్జ్‌ అనలిటికా ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారాన్ని చట్టవిరుద్ధంగా వినియోగించిన సంగతి తెలిసిందే. ఆధార్ సమాచార భద్రతను సవాలు చేస్తూ సుప్రీంలో దాఖలైన 27 పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీం ఈవిధంగా స్పందించింది. అత్యంత కీలకమైన ఎన్నికల ఫలితాలపై ఆధార్‌ డేటా లీకేజీ ప్రభావం చూపించడమంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. కాగా.. దేశంలోని 130కోట్ల మంది ప్రజల ఆధార్‌ సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని, వాణిజ్యపరంగా ఇది బంగారు గని లాంటిదని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.