పింఛన్‌కు 'ఆధార్‌' అక్కర్లేదు..

పింఛన్‌కు 'ఆధార్‌' అక్కర్లేదు..

ఉద్యోగ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛను పొందేందుకు ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ లింకు కాకపోవడంతో చాలామంది విశ్రాంత ఉద్యోగులు పింఛన్‌ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్‌ పొందడానికి ఆధార్‌ తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. జీవన ధ్రువపత్రం దాఖలుకు బ్యాంకులకు వెళ్లే పనిలేకుండా సాంకేతికతను వినియోగించుకునేందుకు ఆధార్‌ ఓ అదనపు సౌకర్యంగా, ప్రత్యామ్నాయంగా ఉపకరిస్తుందన్నారు. ఇక.. దేశంలో ప్రస్తుతం 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా 61.17 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు.