ఐపీఎల్ లో కోహ్లీ తప్పేమి లేదు... అంతా జట్టు వైఫల్యమే...
విరాట్ కోహ్లీ ఆట గురించి అందరికి తెలుసు. ఆయితే ఆటగాడిగా అంత విజయం సాధించిన కోహ్లీ కెప్టెన్ గా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో తాను కెప్టెన్ గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కి ఒక్కసారి కూడా టైటిల్ అందించాలేకపోయాడు. అయితే ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు సార్లు టైటిల్ అందుకున్నాడు. ఇక మహేంద్రసింగ్ ధోనీ చెన్నై సూపర్ సింగ్ ను మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. అలాగే గౌతమ్ గంభీర్ నాయకత్వంలో కోల్కతా నైట్రైడర్స్ రెండు సార్లు టైటిల్ అందించాడు గౌతమ్ గంభీర్. అయితే ఐపీఎల్ లో కోహ్లీ తప్పేమి లేదు.. అంతా జట్టు వైఫల్యమే అంటున్నాడు ఆకాశ్ చోప్రా. ఎందుకంటే.. ఆర్సీబీ సరైన జట్టుని ఎంపిక చేసుకోదు. అలాగే డెత్ ఓవర్లో బౌలింగ్ చేయడానికి ఫాస్ట్ బౌలర్లు లేరు, మరియు నెం .5 మరియు 6 వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సారైనా ఆటగాళ్లు లేరు. ఈ తప్పులు ఎన్ని సార్లు రిపీట్ అయిన ఆర్సీబీ సరి చేసుకోవటం లేదు అని తెలిపాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)