ఇండియా బెస్ట్ ఫీల్డర్లలో కోహ్లీ లాస్ట్...

ఇండియా బెస్ట్ ఫీల్డర్లలో కోహ్లీ లాస్ట్...

భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా రవీంద్ర జడేజాను ఆల్ టైమ్ బెస్ట్ ఇండియన్ ఫీల్డర్ అని తెలిపాడు. ఆకాశ్ చోప్రా తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ... ఆరుగురు ఆల్-టైమ్ ఇండియన్ ఫీల్డర్ల పేర్లను చెప్పాడు. అందులో.. జడేజా మొదట్లో ఆ తర్వాత వరుసగా సురేశ్ రైనా, మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, కపిల్‌‌దేవ్ ఇక చివరగా విరాట్ కోహ్లీని ఎనుక్కునాడు. వారిని ఎందుకు ఎనుకున్నాడో వివరిస్తూ... జడేజా గ్రౌండ్ కవరేజీ అద్భుతంగా ఉంటుందని, అతను స్లిప్ వద్ద ఫీల్డింగ్ లో ఉంటే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తాడని అలాగే అతను ఏ స్థానంలోనైనా ఫీల్డింగ్ చేయగలడు అని పేర్కొన్నారు. ఇక సురేశ్ రైనా స్లిప్‌లో మెరుగైన ఫీల్డర్‌. అదేవిధంగా మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ పాయింట్‌ రీజిన్‌లో అద్భుతమైన ఫీల్డర్లుగా వారికాలంలో నిలిచారు. 1983 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో వివ్ రిచర్డ్స్ క్యాచ్ అందుకున్న తీరే ఐదో స్థానంలో కపిల్‌దేవ్‌ ను తీసుకోవడానికి కారణమని చెప్పాడు, చివరగా, విరాట్ కోహ్లీ ఆటగాడిగా అభివృద్ధి చెందాడు కానీ ఫీల్డర్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నందున అతడిని చివరికి తీసుకున్నట్లు వివరించాడు.