ఆఫ్రీది కి ఘాటు సమాధానం ఇచ్చిన భారత మాజీ ఆటగాడు... 

ఆఫ్రీది కి ఘాటు సమాధానం ఇచ్చిన భారత మాజీ ఆటగాడు... 

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది  మాట్లాడుతూ... నాకు భారతదేశానికి వ్యతిరేకంగా ఆడటం చాల ఇష్టం. వారు మాతో మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత మమల్ని క్షమాపణలు అడుగుతారు అని అనుచిత వ్యాఖ్యలు చేసాడు. దాంతో ఆఫ్రీది పై భారత అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక తాగాజా ఈ విషయం పై భారత మాజీ ఆటగాడు ప్రస్తుత వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా  స్పందించారు.  ఆఫ్రీది కి ఘాటు సమాధానం ఇస్తూ... అతను ఆ 2017  ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ విజయాన్ని మనసులో ఉంచుకొని అలా మాట్లాడుతున్నావ్ కావచ్చు... కానీ  అదే టోర్నీలో పాకిస్థాన్‌ని భారత్ ఓడించింది ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. చోప్రా రెండు జట్ల మధ్య తేడా వివరిస్తూ... భారత  జట్టు  ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి.. అక్కడ వారిని ఓడించింది. కానీ.. పాకిస్థాన్ మాత్రం వారి చేతిలో చిత్తుగా ఓడిపోయింది అని అన్నాడు. ఇక ప్రపంచ కప్ గురించి  చెప్పనవసరం లేదు. ఎందుకంటే... అందులో వారు మనల్ని ఒకసారి కూడా ఓడించలేదు. ఇంకా చెప్పాలంటే అండర్-19 క్రికెట్‌లో కూడా పాక్‌పై మనదే పై చేయి అంటూ ఆకాశ్ వివరించాడు.