రివ్యూ: ఆమె

రివ్యూ: ఆమె

నటీనటులు: అమలాపాల్, రమ్య సుబ్రహ్మణ్యన్‌, శ్రీరంజని, వివేక్ ప్రసన్న తదితరులు
సంగీతం: ప్రదీప్ కుమార్

సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ 
నిర్మాతలు: రాంబాబు కల్లూరి

దర్శకత్వం: రత్నకుమార్  

అమలా పాల్ లీడింగ్ రోల్ చేసిన ఆమె సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  జులై 19 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన విడుదల ఆలస్యం అయ్యింది.  తమిళనాడులో ఆడై పేరుతో మూవీ రిలీజ్ చేశారు.  టీజర్ ముందు వరకు సినిమాకు పెద్దగా క్రేజ్ లేదు.  టీజర్ తరువాత ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది.  ఈ హైప్ ను ఆమె ఎంతవరకు సొంతం చేసుకుంది.  ప్రేక్షకులను మెప్పించిందా లేదా తెలుసుకుందాం.  

కథ: 

అమలా పాల్ పూర్తిగా విదేశీ కల్చర్ ఫాలో అవుతుంటుంది.  జీవితం చాలా చిన్నది.  ఎంజాయ్ చేయాలి.  అందరితోనూ సరదాగా ఉండాలి.  నచ్చినట్టు జీవించాలి అన్నది ఆమె ఫిలాసఫీ.  ఫ్రెండ్స్ సరదాగా బెట్టింగ్ లు వేస్తుంటుంది.  పెట్టిన బెట్టింగ్లో గెలవడం కోసం ఎంతకైనా తెగిస్తుంది.  అవసరమైతే సాహసాలు కూడా చేసేందుకు రెడీ అంటుంది.  ఫ్రెండ్స్ కలిసి ఇలా సరదాగా గడుపుతూ... పీకలదాకా మద్యం సేవిస్తుంది.  కళ్ళు తెరిచి చూసే సరికి ఓ పాడుబడిన బంగ్లాలో నగ్నంగా పడుంటుంది.  దీంతో అమలా పాల్ షాక్ అవుతుంది.  ఆ బంగ్లాలోకి ఎవరు ఆమెను తీసుకొచ్చారు...? అలా నగ్నంగా ఎందుకు పడేసి వెళ్లిపోయారు? మద్యం సేవించిన తరువాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

థ్రిల్లింగ్ కథలతో ఎన్ని సినిమాలు వచ్చినా  చూస్తూనే ఉంటారు.  ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే చాలా కీలకం.  ప్రతి సన్నివేశం థ్రిల్లింగ్ కలిగించే విధంగా ఉండాలి.  ఈ విషయంలో దర్శకుడు రత్నకుమార్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి.  సరదాగా తిరిగే అమ్మాయిగా, పాశ్చాత్య ధోరణి ఎక్కువ కనిపించే అమ్మాయిగా అమలా పాల్ పాత్రను డిజైన్ చేశారు.  ఫస్ట్ హాఫ్ అంతా అమలా పాల్ పరిచయం, ఆమె జీవన విధానం, స్నేహితులతో కలిసి ఆమె చేసే హంగామా వంటివి చూపించారు.  ఇంటర్వెల్లో ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది.  అక్కడి నుంచే అసలు కథ ప్రారంభం అవుతుంది.  సస్పెన్స్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠతను కలిగిస్తాయి.  క్లైమాక్స్ సినిమాకు డబుల్ ప్లస్ అయ్యింది.  

నటీనటుల పనితీరు: 

నటీనటులు అని చెప్పేకంటే.. అమలా పాల్ ఎలా నటించింది అనే ఒకే ఒక్క సందర్భంగా గురించి చెప్పుకుంటే చాలు.  ఇందులో ఆమె న్యూడ్ గా కనిపించిన సన్నివేశం సినిమాకు హైలైట్.  ఆలా చేయాలంటే చాలా డేర్ కావాలి. ఆ డేర్ ఆమెలో ఉన్నది కాబట్టి అలా న్యూడ్ పాత్రను అవలీలగా చేసింది.  ప్రతి ఫ్రేములోను అమలా పాల్ మార్క్ కనిపించింది.  సినిమా మొత్తాన్ని ఆమె భుజస్కందాలపై మోసి తీరానికి చేర్చింది.  

సాంకేతిక వర్గం పనితీరు: 

దర్శకుడు రత్నకుమార్ ఇలాంటి కథను తీసుకొని చేసిన సాహసం ఒకెత్తయితే.. అమలాను ఒప్పించి న్యూడ్ సీన్ చేయించడం మరో ఎత్తు.  ఎక్కడా థ్రిల్ మిస్ కానివ్వకుండా కథను నడిపించాడు.  చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతను క్రియేట్ చేయడం సినిమాకు ప్లస్ అయ్యింది.  ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్.  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు తగ్గట్టుగా ఉన్నది.  

పాజిటివ్ పాయింట్స్ : 

అమలా పాల్ 

కథ 

కథనాలు 

మైనస్ పాయింట్స్: 

అక్కడక్కడా సాగతీత 

చివరిగా : ఆమె.. సాహసానికి ప్రతిరూపం