అమీర్, సల్మాన్‌ మధ్య మాటల్లేవ్..! బయటపెట్టిన రవీనా టండన్..!

అమీర్, సల్మాన్‌ మధ్య మాటల్లేవ్..! బయటపెట్టిన రవీనా టండన్..!

అందాజ్ అప్నా అప్నా చిత్రం సూపర్ హిట్ అయ్యింది.. ఈ చిత్రంలో నటించిన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌, కరీనా కపూర్‌, రవీనా టండన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది... అయితే.. ఆ సినిమా షూటింగ్ సమయంలో అమీర్‌, సల్మాన్ మధ్య మాటల్లేవ్‌ అని వెల్లడించారు రవీనా టండన్.. అందాజ్ అప్నా అప్నా షూటింగ్ సమయంలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఒకరితో ఒకరు మాట్లాడలేదని.. కరిష్మా కపూర్‌తో నేనూ మాట్లాడలేదని.. చెప్పుకొచ్చారు. 

సెట్‌లో అందరితో కలిసిపోయే రవీనా టండన్.. అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ.. మేం షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా సరదాగా ఉంది, మాలో ఎవరూ ఒకరితో ఒకరు మాట్లాడలేదు... ఆ చిత్రం ఎలా షూటింగ్ జరిగిపోయిందో కూడా తెలియదు.. కానీ, మాకు మంచి నటులుగా పేరుతెచ్చింది ఆ సినిమా అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. కాగా, రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ఈ మూవీ.. నవంబర్ 4, 1994న విడుదలైంది.. సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలసిందే.