భారతీయ సినిమా ప్రపంచ సినిమాను శాసించాలి
భారతీయ సినిమా ప్రపంచ సినిమాను శాసించే స్థాయికి ఎదగాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఫిల్మ్ డివిజన్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా (ఎన్ఎంఐసీ)ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతు... సమాజ స్థితిగతులకు సినిమాలు అద్దం పట్టాలన్నారు. సినిమాలు, సమాజం ఒకదాన్ని ఒకటి ప్రతిబింబిస్తుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆశాభోంస్లే, ఎఆర్ రెహమాన్, జితేంద్ర, రణ్‌ధీర్ కపూర్, అమీర్ ఖాన్,కరణ్ జోహార్, కపిల్ శర్మ,కార్తిక్ ఆర్యన్,ఇంతియాజ్ అలీ,పూనమ్ ధిలాన్, జితేంద్రా సహా పలువురు సినీ,టీవీ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీతో తీసుకున్న ఫోటోను ఏఆర్ రెహమాన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
At the opening of National Museum of Indian Cinema! @PMOIndia @prasoonjoshi_ @narendramodi pic.twitter.com/b8Iye6KxF2
— A.R.Rahman (@arrahman) January 19, 2019
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)