అమితాబ్ స్టెప్పులకు అమీర్ ఫిదా..!!

అమితాబ్ స్టెప్పులకు అమీర్ ఫిదా..!!

అమితాబ్ బచ్చన్.. అమీర్ ఖాన్ నటిస్తున్న సినిమా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్.  విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 8 న రిలీజ్ అవుతున్నది.  రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ఈ సినిమాకు సంబంధించిన లుక్స్, సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు.  

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ను యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.  అమితాబ్, అమీర్ ఖాన్ ల మధ్య ఈ సాంగ్ ను షిప్ లో చిత్రీకరించారు.  అమీర్ ఖాన్ జోష్ గా స్టెప్పులు వేస్తుంటే.. ఆ స్టెప్పులకు తగ్గట్టుగా అమితాబ్ కూడా స్టెస్ప్ వేయడం విశేషం.  అమితాబ్ స్టెప్పులకు అమీర్ ఖాన్ ఫిదా అయ్యారట.  ఈ విషయాన్ని అమీర్ ఖాన్ ఇంస్టాగ్రామ్ ద్వారా పేర్కొన్నారు.  అమితాబ్ స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.