పాక్ కు వెళ్ళను...ఆమీర్ ఖాన్

పాక్ కు వెళ్ళను...ఆమీర్ ఖాన్

పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ చేయబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరు కాబోవడం లేదని బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్  చెప్పారు. ఇప్పటివరకు తనకు పాకిస్తాన్‌ తహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) నుంచి గానీ, ఇమ్రాన్ ఖాన్ నుంచి గానీ ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. తాను ప్రారంభించిన పానీ ఫౌండేషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని...ఒకవేళ ఆహ్వానం అందినా తాను హాజరు కాబోనని చెప్పారు. ఈ నెల 11వ తేదీన ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమానికి హాజురు కావాల్సిందిగా ప్రముఖ మాజీ స్టార్ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ లకు ఇమ్రాన్ ఖాన్ నుంచి ఆహ్వానాలు అందినట్లు వార్తలు వస్తున్నాయి.  అమీర్ ఖాన్ ను కూడా ఇమ్రాన్ ఆహ్వానించారని తెలుస్తోంది.  12వ తేదీనే పానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని తలపెట్టానని, 10 వేల మంది గ్రామీణ పౌరులు హాజరవుతున్న ఆ కార్యక్రమాన్ని కాదని ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేనని అమీర్‌ చెప్పారు.