అమీర్ నిర్మాతగా.. గుల్షన్ కుమార్ సినిమా

అమీర్ నిర్మాతగా.. గుల్షన్ కుమార్ సినిమా

బాలీవుడ్ లో టిసీరీస్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఒకప్పుడు ఆడియో క్యాసెట్లను మాత్రమే రిలీజ్ చేసే ఈ కంపెనీ.. ఇప్పుడు డిజిటల్ రంగంలో దూసుకుపోతున్నది.  పలు చిత్రాలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. బడా బాలీవుడ్ నిర్మాణ సంస్థలకు ధీటుగా సినిమా నిర్మాణ రంగంలోకి దిగి సినిమాలను నిర్మిస్తున్నది.  

కాగా, టిసిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో సినిమా రూపొందిస్తున్నారు.  ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, టిసీరీస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2019 క్రిష్టమస్ కు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.