ఒక సినిమా కోసం ఇంకో సినిమా ఒదులుకున్న అమీర్ !

ఒక సినిమా కోసం ఇంకో సినిమా ఒదులుకున్న అమీర్ !

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేయాల్సిన సినిమాలు జాబితాలో జాబితాలో రాకేష్ శర్మ బయోపిక్ 'సారే జహాసె అచ్చా' కూడ ఒకటి.  నినన్ మొన్నటి వరకు అమీర్ ఈ సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు.  కానీ ఇప్పుడు ఆ సినిమా చేయట్లేదని అమీర్ స్వయంగా తెలిపారు. 

అంతేకాదు చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నానని అన్నారు.  అమీర్ స్థానంలో షారుఖ్ ఖాన్ ఈ సినిమా చేయనున్నాడు.  అమీర్ ఈ సినిమా నుండి తప్పుకోడానికి ప్రధాన కారణం ఆయన 'మహాభారత్' అనే వెబ్ సిరీస్ చేయనుండటమే.  ఏడు ఎపిసోడ్స్ గా ఉండనున్న ఈ వెబ్ సిరీస్ చాలా సమయం తీసుకోనుంది.  దీన్ని కొత్త దర్శకుడు మహేష్ మతై డైరెక్ట్ చేయనున్నాడు.