సౌత్ రీమేక్‌లో బాలీవుడ్‌ ఖాన్‌లు

సౌత్ రీమేక్‌లో బాలీవుడ్‌ ఖాన్‌లు

సౌత్‌ ఇండియాలో హిట్ అయిన మూవీలను బాలీవుడ్‌లో రీమేక్ చేయడం కొత్తకాదు... ఈ వరుసలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ముందుంటారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా సౌత్ రీమేక్‌ల్లో నటించి హిట్ అందుకున్నారు. తాజాగా మరో రీమేక్‌పై కన్నేశాడు అమీర్‌ఖాన్.. తమిళ హిట్ మూవీ 'విక్రమ్ వేద' హిందీలో రీమేక్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో నటించడానికి అమీర్ ఖాన్ ఇప్పటికే సైన్ చేశారని తెలుస్తోంది. హిందీలో కూడా 'విక్రమ్ వేద' పేరుతో దీన్ని రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో దర్శకత్వంలో వహించిన గాయిత్రి పెష్కర్ హిందీలోనూ ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయబోతున్నారట. 

తమిళంలో భారీ హిట్ అందుకున్న ఈ మూవీలో మాధవన్, విజయ్ సేతుపతి కీలకమైన పాత్రల్లో నటించారు. ఇప్పుడు హిందీలో అమీర్ ఖాన్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా నటించనున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అమీర్ ఖాన్ నెగెటివ్ రోల్ చేయనున్నట్టు టాక్ నడుస్తుండగా.. సైఫ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయబోతున్నారట. నీరజ్ పాండే ఈ మూవీని నిర్మిచబోతుండగా.. ఈ ప్రాజెక్టును 2020 మార్చిలో ప్రారంభించే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కాగా, 2017లో తమిళంలో రిలీజ్ అయిన విక్రమ్ వేద భారీ విజయాన్ని అందుకుంది.. రూ.11 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ మూవీ.. విడుదలైన తొలివారంలోనే రూ.10 కోట్లకు పైగా రాబట్టగా.. మొత్తంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు లెక్కలు చెబుతున్నాయి.