సందిగ్ధంలో `మ‌హాభార‌తం-3డి`?

సందిగ్ధంలో `మ‌హాభార‌తం-3డి`?
పురాణేతిహాసాలు తెర‌కెక్కించ‌డం అన్న‌ది పెనుస‌వాళ్ల‌తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఈ త‌ర‌హా క‌థ‌ల్ని ఎంచుకోవ‌డం అన్న‌ది నేడు ప్యాష‌న్‌గానూ, తెలివైన ప్లాన్‌గానూ మారిన నేప‌థ్యంలో వ‌రుస‌గా అన్ని ఇండ‌స్ట్రీలో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా భారీ చిత్రాల్ని ప్ర‌క‌టిస్తున్నారు. ఆ కోవ‌లోనే అమీర్ ఖాన్ `మ‌హాభార‌తం-3డి`ని ప్ర‌క‌టించారు. భార‌తంలో అన్ని ఘ‌ట్టాల్ని ఏకంగా 5 సినిమాలుగా తీసేందుకు దాదాపు 1000 కోట్ల మేర బ‌డ్జెట్‌ని వెచ్చించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అమీర్ ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రిల‌య‌న్స్ ముఖేష్ అంబానీ పెట్టుబ‌డులు స‌మ‌కూర్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజా అప్‌డేట్ లేనేలేదు. అందుకు కార‌ణం రివీలైంది. పురాణేతిహాసాల్ని తెర‌కెక్కిస్తే `ప‌ద్మావ‌త్‌` త‌ర‌హా వివాదాలు ఎదుర‌వుతాయ‌ని అమీర్‌ భ‌య‌ప‌డుతున్నార‌ట‌. హిందువుల మ‌నోభావాల‌కు సంబంధించిన ఇష్యూస్ త‌లెత్తినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న సందిగ్ధ‌త అత‌డిలో ఉందిట‌. అందుకే ఇప్ప‌టికి సందిగ్ధ‌త కొన‌సాగుతోంది. ఈ ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టేసిన‌ట్టేనా? అంటే ఇప్ప‌టికి క్లారిటీ లేదింకా. అయితే వెంట‌నే మాత్రం సెట్స్‌కెళ్లే ఆలోచ‌న డ్రాప‌య్యార‌ని ఓ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక పేర్కొంది. అమీర్ దీనిపై ఇంకా సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నాడు. అయితే 1000 కోట్ల ప్రాజెక్ట్ ఆదిలోనే ఇలా అయితే క‌ష్టం. అయినా ఏదీ అడుగు వేయ‌కుండానే ఏం జ‌రుగుతుందో ఎలా చెప్ప‌గ‌లం? ఎందుకిలా? రిల‌య‌న్స్ అంబానీ ఉండ‌గా భ‌య‌మేల‌? అని సినిమా ఫ్యాన్స్ ప్ర‌శ్నిస్తున్నారు.