షారుక్ సినిమా ట్రైలర్ చూసి షాకైన ఆమీర్ ఖాన్ !

షారుక్ సినిమా ట్రైలర్ చూసి షాకైన ఆమీర్ ఖాన్ !

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చేసిన కొత్త సినిమా 'జీరో'.  ఇందులో షారుక్ ఎత్తు మరీ తక్కువ కలిగిన వ్యక్తిగా నటించాడంటి సినిమాపై అందరిలోను అమితాసక్తి నెలకొని ఉంది.  ఈ చిత్ర ట్రైలర్ రేపు ఉదయం విడుదలకానుంది.  ఈలోపు మరొక స్టార్ హీరో ఆమీర్ ఖాన్ ట్రైలర్ ను వీక్షించారట.  

ట్రైలర్ చూసిన ఆయన ఒక్కమాటలో చెప్పాలంటే అది షాక్ ఇచ్చేలా ఉందని, షారుక్ గొప్పగా చేశారని, అనుష్క శర్మ నమ్మలేని రీతిలో నటించిందని, కత్రినా పెర్ఫార్మెన్స్ సూపర్ అని చెప్పుకొచ్చారు.  దీంతో ప్రేక్షకుల్లో టీజర్ పట్ల ఆసక్తి మరింత పెరిగింది.  డిసెంబర్ ఆఖరున విడుదలకానున్న ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్. రాయ్ డైరెక్ట్ చేశారు.