ఫ్లాప్ ఇచ్చినందుకు క్షమాపణ చెప్పిన అమీర్ !

ఫ్లాప్ ఇచ్చినందుకు క్షమాపణ చెప్పిన అమీర్ !

కొన్నిరోజుల క్రితం బాలీవుడ్లో విడుదలైన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.  మెజారిటీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మెచ్చలేదు.  ఈ పరాజయానికి పూర్తి భాద్యత తీసుకుంటున్నట్టు హీరో అమీర్ ఖాన్ తెలిపారు. 

తమ టీమ్ చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు నచ్చలేదని, తమ ఆలోచన తప్పయిందని అన్నారు.  అంతేకాదు భారీ అంచనాలతో సినిమాకు వచ్చిన ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయలేకపోయినందుకు క్షమాపణల్ని తెలిపారు.  గత కొద్దిరోజులుగా ఫ్లాప్ సినిమా ఇచ్చాడని అసహనంగా ఉన్న ఆయన అభిమానులు ఇలా అమీర్ పరాజయానికి బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పడంతో శాంతించారు.