శృంగార ఆధ్యాత్మిక వేత్త పాత్రలో అమీర్..!!

శృంగార ఆధ్యాత్మిక వేత్త పాత్రలో అమీర్..!!

ఇటీవల కాలంలో బాలీవుడ్ లో వరసగా బయోపిక్ లు వస్తున్నాయి. సంజయ్ దత్ జీవితం ఆధారంగా నిర్మితమైన సంజు సినిమా భారీ హిట్టైంది.  దీంతో బయోపిక్ సినిమాలకు క్రేజ్ ఏర్పడింది.  ఏంఎస్ ధోని, సచిన్, వంటి క్రీడాకారుల  జీవితాల ఆధారంగా సినిమాలు రిలీజ్ అయ్యాయి.  1983 లో ఇండియాకు ప్రపంచ కప్ అందించిన జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందబోతున్నది.  

ఇదిలా ఉంటె, సంజయ్ దత్ సినిమాలో నచ్చక ఛాన్స్ మిస్ చేసుకున్న అమీర్ ఖాన్, ఓ బయోపిక్ సినిమాలో నటించబోతున్నాడు.  తన ప్రవచనాలతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త ఓషో జీవితం ఆధారంగా ఓ సినిమా తీసేందుకు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నాడు.  శకున్ బత్రా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారట.  అమీర్ ఖాన్ ఓషో పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.  దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని వినికిడి.  త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.