థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ అక్కడ భారీ వసూళ్లు

థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ అక్కడ భారీ వసూళ్లు

అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ నటించిన మల్టీస్టారర్ సినిమా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్.  ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఇండియా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది.  మొదటిరోజు వసూళ్లు తప్పించి పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది.  

ఈ సినిమాను ఈరోజు చైనాలో రిలీజ్ చేశారు.  దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలు చైనాలో మంచి వసూళ్లు సాధించడం ఈ సినిమాకు ప్లస్ అయింది.  మొదటి రోజు చైనాలో రూ.12.25 కోట్లు వసూలు చేసింది.  థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమా పరంగా ఇది పెద్ద వసూళ్లే అని చెప్పాలి.  మొదటి రోజు వచ్చినంత కలెక్షన్ రెండో రోజు కూడా వస్తుందా అన్నది తెలియాలి.