ధనుష్ వద్దన్నది ఆమీర్ ఖాన్ కి ముద్దట

ధనుష్ వద్దన్నది ఆమీర్ ఖాన్ కి ముద్దట

బాలీవుడ్ స్టార్స్ బయోపిక్స్ అంటే ఎగిరి గంతేస్తారు. అమాంతం ఆఫర్ స్వంతం చేసుకుంటారు. ఇదే విషయం మరో సారి ప్రూవ్ అయింది. ధనుష్ వద్దన్నాడు. అదే బయోపిక్ ఆమీర్ ఖాన్ ముద్దన్నాడు. ప్రస్తుతం చేస్తోన్న సినిమా కాగానే వెండితెర చదరంగానికి సిద్ధమవుతాడట! దక్షిణాదిలో ధనుష్ సంగతి మనకు తెలిసిందే. 

ఆయన ఏదైనా ప్రాజెక్ట్ ఒప్పుకుంటే అందులో చాలా విషయమే ఉంటుంది. రొటీన్ కమర్షియల్ సినిమాలు ఎంతో అరుదుగా కానీ ఈ వెర్సటైల్ హీరో చేయడు. అయితే, బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్ కూడా అదే రూటులో వెళుతుంటాడు. ఆయన ఒక సినిమా చేస్తున్నాడంటే మూవీ లవ్వర్స్ కి పండగే. వెరీ వెరీ డిఫరెంట్ అయితే తప్ప మన మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ మూవీ సైన్ చేయడు. అయితే, ఇప్పుడు ధనుష్ చేజారిన ఒక క్రేజీ బయోపిక్ ను ఆమీర్ అందిపుచ్చుకున్నాడట. 

గతంలో ‘దంగల్’ సినిమాలో మహావీర్ సింగ్ పోగట్ గా... నిజ జీవిత పాత్ర పోషించాడు ఆమీర్. ఇక నెక్ట్స్ మూవీలో... విశ్వనాథన్ ఆనంద్ గా కనిపిస్తాడట! ఆమీర్ ఖాన్ని విశ్వనాథన్ ఆనంద్ పాత్రలో చూడటం నిజంగా ఎగ్జైటింగ్ విషయమే. అయితే, మన ఇండియన్ చెస్ ఛాంపియన్ లైఫ్ ని సిల్వర్ స్క్రీన్ పై చూపించాలని భావించాడు దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్. ఆయన ఫస్ట్ ఛాయిస్ ధనుష్ అంటున్నారు. విశ్వనాథన్ ఆనంద్ గా కోలీవుడ్ స్టార్ అద్భుతంగా సరిపోయేవాడే. అయితే, ఎందుకోగానీ ధనుష్ తగినంత ఉత్సాహం చూపలేదట. ఆయనకు ఇతర సినిమాలు లైన్లో ఉండటం కూడా ఒక కారణం అంటున్నారు. మరి ధనుష్ నుంచీ గ్రీన్ సిగ్నల్ రాకపోవటంతో... దర్శకుడు మాత్రం ఏం చేస్తాడు? ఆనంద్ ఎల్. రాయ్ ఆమీర్ ఖాన్ను అప్రోచ్ అయ్యాడట. ఆయన వెంటనే ఓకే చేశాడని ముంబై టాక్. 

ప్రస్తుతం చేస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ పూర్తి కాగానే విశ్వనాథన్ ఆనంద్ వేషం కడతాడట. ఇప్పటికీ డైరెక్టర్ కి ఆమీర్ నుంచీ క్లియర్ గా గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటున్నారు. చూడాలి మరి, పర్ఫెక్షనిస్ట్ నుంచీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో!