'మహారాజా'గా ఆమీర్ కుమారుడు

'మహారాజా'గా ఆమీర్ కుమారుడు

ఆమీర్ ఖాన్, రీనా దత్తా కొడుకు జునైద్ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన నటిస్తోన్న సినిమా ఫిబ్రవరీ 15న ప్రారంభమైంది. సిద్ధార్థ్ పీ. మల్హోత్రా దర్శకత్వం వహిస్తోన్న 'మహారాజా' సినిమా గురించిన అప్ డేట్ ఆమీర్ కూతురు ఇరా ఖాన్ అందించింది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో అన్న జునైద్ తో తాను ఉన్న ఒక ఫోటో షేర్ చేసింది. దానితో పాటూ రాసిన స్టేటస్ లో జునైద్ ఖాన్ ఫస్ట్ మూవీ 'మహారాజా' మొదలైందంటూ ప్రకటించింది.