'ఆప్‌' స్టార్‌ క్యాంపెయినర్‌గా చంద్రబాబు?

'ఆప్‌' స్టార్‌ క్యాంపెయినర్‌గా చంద్రబాబు?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తమ స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రకటించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయించినట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్‌, హర్యానాల్లో తమ పార్టీకి మద్దతుగా చంద్రబాబుతో ప్రచారం చేయించాలని ఆ పార్టీ భావిస్తోంది. చంద్రబాబుతోపాటు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా, కమల్‌హాసన్‌, ప్రకాష్‌రాజ్‌లను తమ పార్టీ తరఫున ప్రచారానికి దించాలని అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌  నిర్ణయించినట్టు తెలిసింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకండా ఆప్‌ ఒంటరిగా బరిలోకి దిగుతోంది.