రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్ 

రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్ 

రఫేల్ డీల్ తీర్పును పునఃసమీక్షించాలని ఆప్ రాజ్యసభ ఎంపీ  సంజాయ్ సింగ్  సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్ వేశారు. రఫేల్ పై అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు ఒకేసారి గతంలో తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో సంజాయ్ సింగ్ తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంలో రివ్యూపిటిషన్ వేశారు. రఫేల్ జెట్ ఫైటర్స్ డీల్ పై ఉన్న నాలుగు పిటిషన్లను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వలోని బెంచ్ డిసెంబర్ 14 తీర్పు చెప్పింది. ఈ డీల్ పై  ఎలాంటి అనుమానాలు లేవు అని తేల్చి చెప్పింది. ఇది రక్షణ శాఖకు సంబంధించిన విషయం అని తెలిపింది. ఇందులో ఎలాంటి వ్యాపార దోరణి లేదని కోర్టు తెలిపింది. దీనిపై గతంలో సింగ్ తో పాటు న్యాయవాది ఎంఎల్ శర్మ, వినీత్ దండే, బీజేపీ మాజీ నేత అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా , ప్రశాంత్ భూషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పడు సింగ్ ప్రత్యేకంగా రివ్యూ పిటిషన్ వేశారు.