బీజేపీలో చేరిన ఆప్ ఎమ్మెల్యే

బీజేపీలో చేరిన ఆప్ ఎమ్మెల్యే

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ షాక్‌ తగిలింది. గాంధీ నగర్‌ ఆప్‌ ఎమ్మెల్యే అనిల్‌ బాజ్‌పేయి పార్టీని వీడి.. బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ సమక్షంలో శుక్రవారం అనిల్‌ బాజ్‌పేయి కాషాయ కండువా కప్పుకున్నారు. ఏడు లోక్‌సభ స్థానాలున్న ఢిల్లీలో మే 12న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్‌ ఎమ్మెల్యే బీజేపీలో చేరడం కేజ్రీవాల్‌కు తీవ్ర నష్టం కల్గిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే బీజేపీ పార్టీ తమను అధికారంలోంచి దించడానికి ప్రయత్నిసుందని.. ఏడుగురు ఆప్‌ ఎమ్మెల్యేలకు రూ. 10 కోట్లు ఆఫర్‌ చేసి ప్రలోభాలకు గురి చేస్తోందని కొన్ని రోజుల క్రితమే ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్‌ సిసోడియా ఆరోపించారు.