'ఆప్' కు మరో షాక్
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ఆశుతోష్ రాజీనామా చేసి వారం రోజులు గడవక ముందే, మరో నేత ఆశిష్ కేతాన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా లేఖను ఆగస్టు 15నే పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు పంపినట్లు తెలుస్తుంది. తాను లీగల్ ప్రాక్టీస్ చేసేందుకు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు క్రీయాశీల రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ఆశిష్ కేతాన్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఆప్- కేంద్రం మధ్య వివాదం నేపథ్యంలో ప్రభుత్వ సలహా మండలి అయిన ఢిల్లీ డైలాగ్ డెవలప్మెంట్ కమిషన్ నుంచి గత ఏప్రిల్‌లోనే కేతాన్ వైదొలిగిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికలకు కేతాన్ టికెట్ ఆశించారని, పార్టీ అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఒక్కొక్కరుగా రాజీనామ చేయడం ఆప్ కు మింగుడుపడటం లేదు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)