మళ్లీ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం..

మళ్లీ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం..

ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చర్చలు సఫలం అయ్యాయి. ఆస్పత్రుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆందోళన విరమించాయి. తెలంగాణలో 5 రోజుల తర్వాత ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తిరిగి ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలోని సూపర్‌ స్పెషాలిటీ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో .. ఎవరికి ఇబ్బంది లేకుండా తిరిగి ఆరోగ్యసేవలు అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఈటల. దేశంలోని ఆయుష్మాన్‌ భారత్‌ కంటే తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు గొప్పదన్నారాయన. ఆయుష్మాన్‌ భారత్‌తో కేవలం 25 లక్షల మందికి వైద్యం అందితే.. ఆరోగ్యశ్రీతో 84 లక్షల కుటుంబాలకు వైద్య సేవలు అందుతాయన్నారు మంత్రి ఈటల రాజేందర్.