'సిక్స్ కొడితే.. ముంబయికి మారిపోతా'..

'సిక్స్ కొడితే.. ముంబయికి మారిపోతా'..

ఆస్ట్రేలియా క్రికెటర్లకు స్లెడ్జింగ్ వెన్నతో పెట్టిన విద్య. ఫీల్డ్‌లో ఆట కంటే ఎక్కువగా నోటికే పనిచెబుతుంటారు. అందులో ఇండియన్ టీమ్‌తో సిరీస్ అంటే మరింత రెచ్చిపోతారు. మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్ట్ లో సైతం ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ తన నోటికి పని చెప్పాడు. రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేస్తుండగా 'నువ్వు సిక్స్ కొడితే.. నేను ముంబయికి మారిపోతా'.. అంటూ పైన్ కవ్వించే యత్నం చేశాడు‌. రోహిత్  ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆసీస్ కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్ వికెట్ల వెనకాల నుంచి ప్రయత్నించాడు. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ లెగ్‌లో అరోన్ ఫించ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు.  ‘ఫించ్‌ నువ్వు ఐపీఎల్లో దాదాపు అన్ని జట్ల తరపున ఆడావు కదా. బెంగళూరు తప్ప మిగతా జట్లకు ఆడా’ అంటూ పైన్‌కు బదులిచ్చాడు. నువ్వు ఇప్పుడు సిక్స్‌ కొడితే.. నేను ముంబైకి మారిపోతా’ అంటూ వికెట్ల వెనుక నుంచి రోహిత్ కు సవాల్ విసిరాడు. అయితే రోహిత్‌ ఇవేవీ పట్టించుకోకుండా బ్యాటింగ్ కొనసాగించారు.