ఆటకు రెడీ అయిన నారా రోహిత్ !

ఆటకు రెడీ అయిన నారా రోహిత్ !

హీరో నారా రోహిత్ చేస్తున్న సినిమాల్లో 'ఆటగాళ్లు' కూడ ఒకటి.  గేమ్ ఫర్ లైఫ్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన  ఈ సినిమాను పరుచూరి మురళి  డైరెక్ట్ చేశారు.  అన్ని పనుల్ని  ముగించుకున్న ఈ సినిమా ఈ ఆగష్టు నెల 24న విడుదలకానుంది. 

రోహిత్ సినిమా దర్శకుడిగా నటిస్తున్న ఈ సినిమా సీనియర్ నటుడు జగపతిబాబు కూడ ఒక కీలక పాత్ర చేస్తున్నారు.   ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రోహిత్ కు జోడీగా బెంగాలీ మోడల్ దర్శన బానిక్ అలరించనుంది.