ఆటగాళ్లు..ఓ తెలివైన ఆట

ఆటగాళ్లు..ఓ తెలివైన ఆట
జగపతి బాబు, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఆటగాళ్లు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రీసెంట్ గానే నారా రోహిత్ సినిమా డబ్బింగ్ పనులను మొదలెట్టాడు. ఈ సినిమా కథ విషయానికొస్తే..ఇంటెలిజెంట్ థ్రిల్లర్ గా ఉండనుంది. జగపతి బాబు, నారా రోహిత్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని చిత్రబృందం చెప్తోంది. స్క్రిప్ట్ లో కంటే స్క్రీన్ మీదే బెస్ట్ అవుట్ ఫుట్ దర్శకుడు పరుచూరి మురళి తెచ్చారని నిర్మాతలు చెప్తున్నారు. త్వరలోనే టీజర్, ట్రైలర్, ఆడియో ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలెట్టనున్నారు. అన్ని రకాల నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తవ్వగానే వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో నారా రోహిత్ సరసన దర్శనా బానిక్ హీరోయిన్ గా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా, వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మించారు.