ఆటగాళ్ళు టీజర్ టాక్ : సస్పెన్స్ థ్రిల్లర్ 

ఆటగాళ్ళు టీజర్ టాక్ : సస్పెన్స్ థ్రిల్లర్ 

మన తెలుగులో మల్టీ స్టారర్స్ కు ఎప్పట్నుంచో మంచి మార్కెట్ ఏర్పడింది. తాజాగా నారా రోహిత్, జగపతి బాబులు కలిసి నటించిన చిత్రం 'ఆటగాళ్ళు'. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను ఇవాళే చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇందులో నారా రోహిత్ సినిమా దర్శకుడిగా కనిపించగా, జగపతి బాబు పేరున్న క్రిమినల్ లాయర్ పాత్రలో దర్సనమిచ్చాడు. అసలు కథ విషయానికొస్తే నారా రోహిత్ భార్య అంజలి (దర్శన బానిక్) హత్యకు గురవుతుంది. ఈ కేసును వాదించడానికి పిపి (జగపతి బాబు) ముందుకొస్తాడు. ఇలా ఆ హత్య ఎవరు చేశారు అనే కోణంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తూ దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ కాబట్టి ఇద్దరు స్టార్ హీరోల మధ్య బలమైన సీన్స్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇంటరాగేషన్ సీన్స్ లో జగపతి బాబు, నారా రోహిత్ ల మధ్య సంభాషణ ఆకట్టుకునేలా ఉంది. పోలీస్ పాత్రలో సుబ్బరాజు చెప్పే క్లూ డైలాగ్ నారా రోహిత్ నెగటివ్ షేడ్స్ ను చెప్తూనే..అంజలి అంటే తనకు ఎంతో ప్రేమో అనే విషయంన్ని క్లియర్ గా చెప్పి సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేశారు. సాయి కార్తీక్ సంగీతం కథకు తగ్గట్టు బాగుంది. విజయ్ సి కుమార్ కెమెరా పనితనం కూడా మెచ్చుకోదగ్గ రీతిలో ఉండగా, ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.