క్రేజీ మల్టీ స్టారర్ ట్రైలర్ రేపే 

క్రేజీ మల్టీ స్టారర్ ట్రైలర్ రేపే 

మన తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. తాజాగా నారా రోహిత్, జగపతి బాబు కాంబినేషన్ లో ఆటగాళ్లు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రైమ్ బేస్డ్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఇది వరకే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతోంది. ఇక ప్రమోషన్స్ ను వేగవంతం చేసే పనిలో భాగంగా రేపు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. 

కొద్దీ రోజుల క్రితమే టీజర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో నారా రోహిత్ సినిమా దర్శకుడిగా కనిపించనుండగా, జగపతి బాబు క్రైమ్ లాయర్ గా దర్శనమివ్వనున్నాడు. ముఖ్యంగా నారా రోహిత్ భార్య అనుమానాస్పద మృతి చుట్టూ ఈ కథ అల్లుకుని..మెయిన్ లీడ్స్ మధ్య మైండ్ గేమ్ లా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని అర్థమవుతోంది. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా, ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమైంది. త్వరలోనే ఆడియోను రిలీజ్ చేసి ఆగష్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.