డివిలియర్స్ : నా కెప్టెన్ ధోని.. మరి కోహ్లీ..? 

డివిలియర్స్ : నా కెప్టెన్ ధోని.. మరి కోహ్లీ..? 

దక్షిణాఫ్రికా మాజీ బాట్స్మెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఎబి డివిలియర్స్ తన ఆల్ టైమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎలెవన్‌ జట్టును ఎంపిక చేసాడు. అయితే ఈ లీగ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడుతున్న డివిలియర్స్, తన ఆల్ టైమ్ జట్టుకు మాత్రం కెప్టెన్ గా కోహ్లీని ఎంచుకోలేదు. డివిలియర్స్.. వీరేందర్ సెహ్వాగ్‌ తో పాటుగా రోహిత్ శర్మను తన జట్టుకు ఓపెనర్‌గా ఎంపిక చేసుకున్నాడు, ఇక 3 వ స్థానం లో కోహ్లీ, 4 లో స్వయంగా తన పేరునే ప్రస్తావించాడు, ఇక ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను 5 వ స్థానంలో, 3 సార్లు ఐపీఎల్ విజేతలుగా నిలిచినా సిఎస్కే కాప్టెన్ ధోనిని, డివిలియర్స్ ఆల్ టైమ్ ఎలెవన్‌లో 6 వ స్థానంలో అలాగే తన జట్టుకు కెప్టెన్ అని తెలిపాడు, మరో సిఎస్కే ఆటగాడు రవీంద్ర జడేజాతో  పాటు రషీద్ ఖాన్ స్పిన్ విభాగాన్ని నిర్వహిస్తుండగా, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, కగిసో రబాడా ను పేస్ విభాగంలోకి తీసుకున్నాడు. 

ఎబి డివిలియర్స్ ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్:  వీరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, బెన్ స్టోక్స్, ఎంఎస్ ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, కగిసో రబాడా, జస్ప్రీత్ బుమ్రా.