డివిలియర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్...

డివిలియర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్...

ఏబీ డివిలియర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. మిస్టర్ 360 ఆసీస్ టీ 20 లీగ్ అయిన బిగ్ బ్యాష్ లీగ్ 10వ సీజన్ నుండి తప్పుకున్నాడు. డివిలియర్స్ భార్య త్వరలో మూడో బిడ్డకు జన్మనివ్వనుంది. అందువల్ల డెలివరీ సమయంలో ఆమెతో ఉండాలని నిర్ణయించుకున్న డివిలియర్స్ రాబోయే బిగ్ బ్యాష్ లీగ్ నుండి తప్పుకున్నాడు. ఈ లీగ్ డిసెంబర్ 3న ప్రారంభమై వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న ముగుస్తుంది. దాంతో తాజా ప్రకటనలో '' నేను త్వరలో మూడోసారి తండ్రి అవుతున్నాను. అందువల్ల నేను నా భార్యతో ఉండాలని అనుకుంటున్నాను. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ కరోనా సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేయలేని పరిస్థితి. ఆ కారణంగా నేను బిగ్ బ్యాష్ లీగ్ నుండి తప్పుకుంటున్నాను'' అని డివిలియర్స్ తెలిపాడు. అయితే ప్రస్తుతం మిస్టర్ 360 ఐపీఎల్ లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ నవంబర్ 10న ముగిసిన తర్వాత ఏబీడి తన భార్య వద్దకు వేళనున్నాడు.