2023 వరల్డ్‌కప్‌లో ఆడతా.. కానీ: డివిలియర్స్‌

2023 వరల్డ్‌కప్‌లో ఆడతా.. కానీ: డివిలియర్స్‌

ఏబీ డివిలియర్స్.. ఈ హార్డ్‌ హిట్టింగ్‌ బ్యాట్స్‌మన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. సూపర్‌ ఫామ్‌లో ఉండగానే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ డాషింగ్‌ ప్లేయర్‌.. వరల్డ్‌ వైడ్‌ టీ20 లీగ్స్‌లో ఆడుతూ భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. ఇప్పటికీ ఫుల్‌ ఫిట్‌నెస్‌తో ఉన్న డివిలియర్స్‌ మళ్లీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తాడా..? 2023 వరల్డ్ కప్‌ ఆడతాడా? ఇదే ప్రశ్నను ఓ ఇంటర్వ్యూలో అతణ్నే అడిగితే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ప్లేయర్‌ ధోనీ 2023 వరల్డ్‌కప్‌లో ఆడితే తానూ కచ్చితంగా ఆడతానని చెప్పాడు. సరదాగా చేసిన వ్యాఖ్యే అయినప్పటికీ ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్‌గా మారింది.