ఏదైనా ఐపీఎల్ తరువాతనే అంటున్న ఏబీడి...

ఏదైనా ఐపీఎల్ తరువాతనే అంటున్న ఏబీడి...

క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తూ  2018 మేలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌. ఏబీడి దూరం అయిన తరువాత ఆ జట్టు పరిస్థితి ఘోరంగా తయారైంది. అయితే 2019 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో జట్టు కోసం తాను అందుబాటులో ఉంటానని తెలిపాడు మిస్టర్‌ 360 కానీ దానికి ఆ జట్టు సెలక్టర్లు ఒప్పుకోలేదు. అయితే ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా జట్టు ఏ విధంగా విఫలం చెందిందో అందరికి తెలుసు. కానీ ఇప్పుడు 2020 లో రాబోతున్న టీ20 ప్రపంచకప్‌ లో ఏబీడి ని ఆడించాలని ఆ జట్టు యాజమాన్యం అనుకుంటుంది. అయితే తన రీఎంట్రీ పై మిస్టర్‌ 360 కొంచెం వింతగా స్పందించాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఐపీఎల్ పైనే ఉందని అందులో తాను ప్రాతినిధ్యం వహించే రాయల్‌ఛాలెంజర్స్‌ బెంగళూరు కోసం తన పూర్తి సామర్ధ్యం మేర పోరాడుతానని తెలియజేసాడు. ఈ ఐపీఎల్ తరువాతనే మిగితా వాటి గురించి ఆలోచిస్తాని చెప్పాడు డివిలియర్స్‌. కానీ ఈ నెల 29 న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మ్యాచ్లు వచ్చే నెల 15 వరకు వాయిదా పడ్డిన విషయం అందరికి తెలిసిందే. అయితే చూడాలి మరి ఏబీ డివిలియర్స్‌ 2020 టీ20 వరల్డ్ కప్ ఆడతాడా... లేదా అనేది.