క్యాట్‌ మెట్లెక్కిన ఏబీ వెంకటేశ్వరరావు

క్యాట్‌ మెట్లెక్కిన ఏబీ వెంకటేశ్వరరావు

ఏపీలో సస్పైండ్‌ అయిన ఐపీయస్‌ అదికారి క్యాట్‌ మెట్లెక్కారు . తనకు పోస్టింగ్‌తో పాటు ప్రభుత్వం నిలిపివేసిన జీతాన్ని ఇప్పించాలంటూ క్యాట్‌ను కోరాడు .
సీనియర్ ఐపీయస్ అదికారి కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ మెట్లెక్కారు.ఏపీ ప్రభుత్వం తనను అకారణంగా సస్పెండ్‌ చేయడంతో పాటు..తనకు గత ఏడాది జూన్‌ నుంచి నిలిపేసిన వేతనాన్ని వెంటనే ఇచ్చేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటీషన్‌లో ఏబీ పేర్కొన్నాడు . విదేశీపరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ తనపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలతో  తనకెలాంటి సంబందం లేదంటూ పిటీషన్‌లో చెప్పుకొచ్చిన ఏబీ వెంకటేశ్వర్‌రావు గతంలో పలుమార్లు తనను ఉత్తమ సేవా పథకాలతో సన్మానించిన విషయాన్ని గుర్తుచేసారు.

గత ప్రభుత్వంలోని నిఘా విభాగాదిపతిగా పనిచేసినందుకే ఈ ప్రభుత్వం తనను టార్గెట్‌ చేసిందనీ రాష్ట్ర భద్రత కోసం వృత్తి ధర్మంలో బాగంగానే ఉగ్రవాదులు, మావోయిస్టులు, అసాంఘీకశక్తుల సమాచారాన్ని నిఘావర్గాల నుంచి సేకరించేవాడినన్నారు. గత ఏడాది మార్చిలో డీజీగా పదోన్నతి రాగానే ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టానన్న ఆయన రెండు నెలలకే తనను జీఏడీ విభాగంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో మే 31 న రిపోర్టు చేయడంతో పాటు అప్పటి నుంచి పోస్టింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నానన్నారు . ప్రభుత్వం తనపట్ల కక్షసాదింపు చర్యలకు పాల్పడుతుందన్న ఆయన తనకు పోస్టింగ్‌ ఇవ్వకపోగా..తనకు రావాల్సిన వేతనాన్ని సైతం ప్రభుత్వం నిలిపివేసిందంటూ పిటీషన్‌లో పేర్కొన్నారు .