దీదీకి తలనొప్పి..! బెంగాల్‌లో కొత్త పార్టీ..

దీదీకి తలనొప్పి..! బెంగాల్‌లో కొత్త పార్టీ..

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది.. అధికార తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్షన్లు ఎదురవుతున్నాయి.. ఓ వైపు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు దీదీకి గుడ్‌బై చెప్పేస్తుండగా.. మరోవైపు తాజాగా కొత్త పార్టీ పుట్టుకొచ్చింది.. ముస్లిం నేత అబ్బాస్ సిద్దిఖీ ‘ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్’ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి సపోర్ట్ చేయాలి..? లేదా కొత్త పార్టీ పెట్టాలా? అనే విషయంపై గత కొంతకాలంగా తర్జనభర్జన పడిన ఆయన.. చివరకు పార్టీ పెట్టేందుకు మొగ్గు చూపారు.. అయితే, ఇప్పటికే బెంగాల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం సైతం సిద్ధమవుతోంది.. ఇదే సమయంలో.. ముస్లిం మైనార్టీల ఓట్లు కొల్లగొట్టడానికి మరో పార్టీ పుట్టుకొచ్చింది.. దీంతో.. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకుకు మరింత గండి పడడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఇక, పార్టీ ప్రకటించిన సందర్భంగా సిద్ధిఖీ మాట్లాడుతూ... దేశంలో తమదే నిజమైన సెక్యులర్ పార్టీ అని ప్రకటించారు.. అణగారిన వర్గాలను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే తమ కర్తవ్యమన్న ఆయన.. స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి చాలా మంది తమది సెక్యులర్ పార్టీ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారని, కానీ, ఎవ్వరూ దానిపై నిలబడలేదంటూ మండిపడ్డారు.