కరోనా ముప్పు గురించి ఆగష్టులోనే చెప్పిన బుడతడు...చెప్పిందే జరిగింది ! 

కరోనా ముప్పు గురించి ఆగష్టులోనే చెప్పిన బుడతడు...చెప్పిందే జరిగింది ! 

ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అభిగ్య. ఏడు నెలల క్రితం అంటే ఆగష్టులో అతను చెప్పిన జ్యోతిషం అక్షరాలా ఫలించడంతో అతనిప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అభిగ్య ఆనంద్ అనే బుడతడి వయసు 14 ఏళ్లు. అతనిది మైసూర్. తండ్రి పేరు ఆనంద్ రామసుబ్రమణియన్, తల్లి అన్నుఆనంద్. అతి చిన్న వయసులోనే జ్యోతిష శాస్త్రాన్ని అవుపోసన పట్టడం అభిగ్య ఆనంద్ ప్రత్యేకత. ఇప్పుడతని వయసు 14 ఏళ్లు.

గుజరాత్ లోని మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సంప్రదాయ వేదవిశ్వవిద్యాలయంలో ఒక ఆచార్యుడిగా ఇంత చిన్నవయసులో నియమితుడవడం మామూలు విషయం కాదు. అతి చిన్న వయసులో గ్లోబల్ చైల్ పాడిజీ అవార్డును అందుకున్న ఈ బుడతడు ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఫైనాన్షియల్ అస్ట్రాలజీలో పీహెచ్ డీ చేశాడు. జ్యోతిషంలోని వివిధ విధానాల మీద అనేక పరిశోధనలు చేశాడు. వాస్తు లోనూ నైపుణ్యం సాధించాడు. విశ్వమ్ వాస్తుమయం అనే పోర్టల్ కూడా నిర్వహిస్తున్నాడు.


అతను ఏం చెప్పాడు?

గ్రహస్థితిగతులను అనుసరించి ఒక భయకరమైన వింత వ్యాధి ముంచుకొస్తోందని అతను ముందే హెచ్చరించాడు. ముఖ్యంగా 2019 నవంబరు నుంచి 2020 మే వరకూ ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని ఆగష్టు 2019లోనే తన యూ ట్యూబ్ చానెల్ ద్వారా చెప్పాడు. అందులోనే ప్రపంచ వైమానిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని అతను ప్రకటించాడు. చైనా యుద్ద సమస్యను ఎదుర్కొంటుందని, ధనిక దేశాలుగా చెలామణీ అయ్యే అన్ని దేశాలూ అతలాకుతలం అవుతాయని చెప్పాడు. ముఖ్యంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 మధ్య తీవ్ర పరిణామాలు ఉంటాయని అతను ఆ వీడియోలో ప్రకటించాడు.  అతను చేసిన వీడియోల లింక్ మీరు కింద చూడవచ్చు. గత జన్మలను నమ్మనివారు కూడా అతని వీడియోలు చూస్తే తమ అభిప్రాయాలను మార్చుకుంటారేమో ! అనే సందేహాలను కొందరు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.