టీ20లో సంచలన రికార్డు... ఆరు బంతుల్లో 5 వికెట్లు..

టీ20లో సంచలన రికార్డు... ఆరు బంతుల్లో 5 వికెట్లు..

ఏ గేమ్ అయినా ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంటారు.. పాత రికార్డులను చెరిపివేసి.. సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు కుర్ర ఆటగాళ్లు.. ఆరు బంతుల్లో ఏకంగా 5 వికెట్లు తీసి సంచలన రికార్డులు సృష్టించాడు భారత్‌కు చెందిన అభిమన్యు మిథున్.. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ సెమీఫైనల్‌లో ఈ అరుదైన ఫీట్ నమోదైంది. హరియాణాతో జరిగిన సెమీస్‌లో ఆరు బంతుల్లో 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు కర్ణాటక బౌలర్ అభిమన్యు మిథున్.. దీంతో కర్ణాటక జట్టు 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి ఫైనల్‌కి దూసుకెళ్లింది. చివరి ఓవర్‌లో హరియాణా జట్టును దెబ్బ కొట్టాడు అభిమన్యు మిథున్.. తొలి మూడు బంతులకు మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేసిన ఈ యువ బౌలర్.. నాలుగో బంతికి మరో వికెట్, ఆరో బంతికి ఇంకో వికెట్ తీసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.