అభిషేక్ బచ్చన్ కి కరోనా పాజిటివ్... ఐష్ కి... 

అభిషేక్ బచ్చన్ కి కరోనా పాజిటివ్... ఐష్ కి... 

మహారాష్ట్రలో కరోనా కేసులు  వేగంగా విస్తరిస్తున్నాయి.  సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు.  నిన్న రాత్రి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించిన సంగతి తెలిసిందే.   గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అమితాబ్ ఈనెల 11 వ తేదీన  నానావతి ఆసుపత్రిలో  అడ్మిట్ అయ్యారు.  అక్కడ అమితాబ్ కు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.   దీంతో అయన సభ్యులైన అభిషేక్ బచ్చన్, జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు కూడా కరోనా టెస్టులు నిర్వహించారు.  

ఇందులో జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్ కు కరోనా నెగెటివ్ రాగా, అభిషేక్ బచ్చన్ కు మాత్రం పాజిటివ్ వచ్చింది.  దీంతో అయన కూడా నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, ఎవరూ  భయపడాల్సిన అవసరం లేదని,  త్వరలోనే కోలుకొని ఇంటికి వస్తామని అన్నారు.  బిగ్ బి, అభిషేక్ బచ్చన్ లకు కరోనా  పాజిటివ్ అని తెలిసిన వెంటనే బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.