ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో అభిషేక్‌ వర్మకు గోల్డ్ పతకం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో అభిషేక్‌ వర్మకు గోల్డ్ పతకం

భారత క్రీడాకారుడు అభిషేక్ వర్మకు ఐఎస్‌ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. బీజింగ్‌లో జరుగుతోన్న ఐఎస్ఎస్ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో 10 మిల్లీ మీటర్ల పిస్టల్ ఫైనల్‌లో టాప్ స్పాట్‌లో నిలిచిన అభిషేక్ వర్మ... బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. తన రెండో ప్రపంచ కప్ ప్రదర్శనలో బంగారు పతకాన్ని గెలుచుకోవడంతో 2020 టోక్యో నిర్వహించనున్న ఒలింపిక్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్‌ ఫైనల్‌లో 252.7 పాయింట్లతో అభిషేక్ వర్మ గోల్డ్ మెడల్ సాధించగా... 240.4 పాయింట్లతో రష్యా షూటర్ వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక 220.0 పాయింట్లతో కొరియా షూటర్ కాంస్య పతకం సాధించాడు.