అమెరికాను వణికిస్తోన్న 'బాంబ్ 'తుఫాను

అమెరికాను వణికిస్తోన్న 'బాంబ్ 'తుఫాను

అగ్ర రాజ్యం అమెరికాను 'బాంబ్' తుఫాను వణికిస్తోంది. డెన్వర్ రాష్ట్రంలో పరిస్థితి చేయిదాటిపోయింది. రోడ్డుపై దారికనిపించకపోవడంతో సుమారు 1,100 మంది వాహనదారులు ప్రమాదానికి గురయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అధికారులు ఎవరీని బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు. కొలరాడో, వోమ్నింగ్, నెబ్రాస్కా, డకోటా రాష్ట్రాల్లోనూ భారీగా మంచు వర్షం పడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 23 మిల్లీబార్ల ఒత్తిడితో మంచు కురిసిందని డెన్వర్ పోలీస్ విభాగం తెలిపింది. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని ఆరు రన్ వేలపైనా మంచు పేరుకుపోయిందని విమానాశ్రయ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సుమారు 1.30 లక్షల మంది చీకట్లో మగ్గుతున్నారని ఎక్సెల్ ఎనర్జీ వెల్లడించింది.