'అమ్మ ఒడి' పథకంపై కీలక ప్రకటన

'అమ్మ ఒడి' పథకంపై కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న 'అమ్మ ఒడి' పథకానికి సంబంధించి అపోహలున్న నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయం కీలక ప్రకటన జారీ చేసింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా వారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని పేర్కొంది. లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానం అని.. ప్రభుత్వ, ప్రేవేటు పాఠశాలలకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. నవరత్నాల్లో జగన్‌ హామీలో భాగంగా  పేద విద్యార్థి తల్లికి అమ్మఒడి పథకం కింద రూ.15 వేలు ఇస్తామని పేర్కొంది.