ఏపీకి 'హోదా'పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన

ఏపీకి 'హోదా'పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని  కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఇవాళ లోక్‌సభలో స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఇవాళ లోక్‌సభలో లేవనెత్తారు. దీనికి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదన్న ఆయన.. ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని అంశాలపై దృష్టిపెట్టామని తెలిపారు.