'సైరా'లో తమన్నాకు ఆ క్వాలిటీ ఎక్కువట !

'సైరా'లో తమన్నాకు ఆ క్వాలిటీ ఎక్కువట !

 

ఇటీవలే 'ఎఫ్ 2' సినిమాతో భారీ విజయం అందుకుంది తమన్నా.  ప్రస్తుతం ఈమె చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి.  వాటిలో ఒకటి 'సైరా'.  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.  ఇందులో తమన్నా లక్ష్మి అనే ఒక సంప్రదాయ నృత్యకారిణిగా కనిపించనుంది.  అంతేకాదు ఆమె పాత్రకు దేశభక్తి కూడా ఎక్కువని, కథలో కీలకంగా ఉంటుందని సమాచారం.  రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2020 సంక్రాతి కానుకగా రిలాజ్ చేయనున్నారు.  ఇందులో నయనతార కథానాయిక కాగా జగపతిబాబు, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతిలు పలు ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు.