ఏబీవీపీ ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి 

ఏబీవీపీ ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి 

తెలంగాణ ఇంటర్‌ బోర్డులో జరిగిన అక్రమాలను నిరసిస్తూ ఏబీవీపీ నేతలు మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ వద్దకు చేరుకుని ప్రభుత్వానికి, ఇంటర్‌బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఆందోళనకు దిగిన ఏబీవీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మృతిచెందిన ఇంటర్‌ విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని.. ఈ వివాదంపై సీఎం కేసీఆర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ పై చర్యలు తీసుకోవాలని, గ్లోబరిన సంస్థను బ్లాక్ లో పెట్టాలని అన్నారు. విద్యార్ధులకు న్యాయం చేసేవరుకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.