స్కూల్‌ ఫీజుల తగ్గించాలంటూ ఆందోళన

స్కూల్‌ ఫీజుల తగ్గించాలంటూ ఆందోళన

స్కూల్‌ ఫీజులను నియంత్రించాలని, అందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళన బాట పట్టారు. ఇవాళ ఉదయం భారీ సంఖ్యలో ఏబీవీపీ నాయకులు హైదరాబాద్‌లోని కమిషనరేట్‌ అండ్‌ డైరక్టరేట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యాహక్కు చట్టం అమలు చేయాలని, గుర్తింపులేని పాఠశాలలను వెంటనే రద్దు చేయాలని, ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వీరు నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన పోలీసులు.. వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.