రూ.13 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన సర్పంచ్..

రూ.13 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన సర్పంచ్..

రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్య నారాయణ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. ఓ భూ స్వామి‌ నుంచి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు సర్పంచ్ నవీన్ గౌడ్. మన్నెగూడ చౌరస్తాలో ఆ భూస్వామికి 200 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ప్రధాన రహదారిపై ఉన్న భూమి‌లో షెట్టర్లు కడుతున్నారు యాజమాని. వరుసగా 20 షెట్టర్లు కట్టడానికి సిద్దపడ్డాడు యాజమాని. షెట్టర్లు కట్టడానికి గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోవాలని కోరాడు సర్పంచ్ నవీన్ గౌడ్. అనుమతుల కోసం 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేకపోతే రోడ్డుపై ఉన్న ఓ షెట్టర్‌ను తనకు‌ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని అడిగాడు. 15 లక్షలకు  ఒప్పందం కుదిరింది. ఈ రోజు 13 లక్షల రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నారు అధికారులు. 

రాజేంద్రనగర్‌లోని షాదాన్ కళాశాల వద్ద ఒప్పుకున్న డబ్బులు ఇస్తామని చెప్పాడు భూస్వామి. షాదాన్ కళాశాల వద్ద ఓ కారులో డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అప్పటికే షాదాన్ కళాశాల‌ వద్ద మాటు వేసింది ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ బృందం. అన్వర్ ఉలూమ్ కళాశాల యాజమాన్యం వద్ద డబ్బులు డిమాండ్ చేసినట్టు సమాచారం.