ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్ఐ, హోంగార్డు

ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్ఐ, హోంగార్డు

ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. నల్లగొండ జిల్లా గుర్రంపోడు ఎస్ఐ క్రాంతి కుమార్, హోంగార్డు గఫార్ లంచం తీసుకుంటు ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. గుర్రంపోడు మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన భూతగాదాకు సంబంధించి ఓ రైతు నుంచి రూ.40 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డాడు. అవినీతికి పాల్పడ్డ ఎస్ఐ క్రాంతి కుమార్, హోంగార్డు గఫార్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.