ఏసీబీ మహిళా ఉద్యోగికి వరకట్న వేధింపులు

ఏసీబీ మహిళా ఉద్యోగికి వరకట్న వేధింపులు

ఏసీబీ మహిళా అధికారి పిడిక్కాల ప్రభావతి వరకట్న వేధింపులపై పోలీసులను ఆశ్రయించింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తులసీనగర్‌కు చెందిన ప్రభావతి విజయవాడ ఏసీబీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రభావతి గత నవంబర్‌లో శంకరశెట్టి కిరణ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్న భర్త... ఆ తర్వాత నుంచి రూ.20 లక్షల కట్నం తేవాలంటూ వేధింపులకు దిగాడు. అవి కాస్త శ్రుతి మించడంతో ఆమె పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.